మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓ టి ఎస్ మంచి పథకం సద్వినియోగం చేసుకోండి లబ్ధిదారులకు సూచించిన మంత్రి పేర్ని జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం క్రింద గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో బ్యాంకు రుణంతో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద నిర్దేశించిన మొత్తం చెల్లించి శాశ్వత హక్కు పొందాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని సూచించారు. శనివారం మంత్రి తమ కార్యాలయం వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన లబ్ధిదారులను వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానిక చిలకలపూడి మూడుగుళ్ల సెంటర్‌కు చెందిన మహిళలు వెంకట లక్ష్మి వరలక్ష్మి తదితరులు మంత్రిని కలిసి గతంలో నిర్మించుకున్న ఇళ్లకు డబ్బులు చెల్లించాలని అంటున్నారని, పేదలైన మేము అంత డబ్బు చెల్లించలేమని మంత్రికి తమ సమస్యలు వివరించారు. ఓ టి ఎస్ పథకం ప్రయోజనాలు మంత్రి వారికి వివరించి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం స్వచ్ఛందమే అన్నారు. కోనేరు సెంటర్ లో పూసలు అమ్ముకునే మహిళలు తమకు అద్దెకు ఇళ్లు ఎవరు ఇవ్వడం లేదని, రోడ్లపై ఉండాల్సి వస్తున్నదని తమ సమస్యలు మంత్రికి వివరించారు.వీళ్లల్లో అర్హులకు ఆరుగురికి టిడ్కో ఇళ్లు కొందరికి ఇళ్ల స్థలాలు వచ్చాయని, వీరిని తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తున్న టిడ్ కో ఇళ్లు చూపించాలని, ఈలోగా వీరు నివసించుటకు అద్దె ఇళ్లు చూడాలని మంత్రి సిబ్బందికి సూచించారు.
Tags machilipatnam
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …