విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాకవి భారతి ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, సమాజం లో జరుగుతున్న అణగారిన వర్గాల శ్రేయస్సును ఆకాక్షించి, బలహీన వర్గాలు/పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసారని, మహిళ తన అభివృద్ధిని దిన దినాభివృద్ధికి కృషి చేసేలా ఆయన రచనలు మేల్కొల్పాయ ని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/అధ్యక్షులు అయిన గాంధీ నాగరాజన్ అన్నారు. భవానిపురంలో గల నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహాకవి భారతి 139 వ జయంతిని పురస్కరించుకుని శనివారం గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/అధ్యక్షులు అయిన గాంధీ నాగరాజన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ పాఠశాల పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను నా చిన్న తనంలో కష్టం తో కూడిన ఎన్నో పనులు చేస్తూ వచ్చాను. కానీ సమాజం లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను చూసి ఒకప్పుడు దేశంలో స్వాతంత్ర్య అహిసా పోరాటాలకు నాంది గా నిలిచిన గాంధీ మహాత్ముడు ని చూసి నేనెందుకు ఆ మహాత్ముడిలా మారి ఇప్పుడు సమాజం లో జరుగుతున్న అశాంతిని, సత్యం అహింస తో నాశనం చేయలేను అని దృఢ సంకల్పంతో గాంధీ మహాత్ముడి దీక్షని పూని బ్రతికినా దేశం కోసమే..చచ్చిన దేశం కోసమే…అంటూ పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. గాంధీ నాగరాజన్ భార్య శివరంజని మాట్లాడుతూ ఎప్పుడైతే ఒక మహిళ స్వేచ్ఛగా స్వతంత్ర్యం గా తను అనుకున్న ఎదుగుదలను చూస్తుందో అపుడే నిజమైన స్వతంత్ర్యం అని, ఒక మహిళ ఎదుగుదలకు నిజమైన తోడ్పాటు అందించే వ్యక్తులు మొదట అమ్మ నాన్న తో పాటు గురువు నే అని మరెవ్వరూ కాదు అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గాంధీ నాగరాజన్ కుమారుడు రేపటి గాంధీ గ, గాంధీ ఆశయాలకు వారసుడిగా మాస్టర్ కార్తీ మాట్లాడుతూ మహాకవి భారతి రచనల్లో గల ఒక కవిత్వాన్ని పిల్లలకు వివరించారు. అలాగే ట్రస్ట్ కంపెనీ లో వర్కర్ గా ఉన్న ఆత్మీయురాలు అయిన చంద్ర అక్క తన కుమార్తె తో మంచి విషయాలను పిల్లల ముందు ఉంచారు. ట్రస్ట్ సెక్రెటరీ అయిన భారతి తన భావాలను కవిత్వం రూపంలో ఆహ్లాదకరమైన వాతావరణం లో అందించారు. సెక్రెటరీ అయిన లేడీ అంబేద్కర్ గా పిలవబడుతున్న సౌజన్య మాట్లాడుతూ సమాజం లో హింసను దూరం చేయాలంటే ప్రతి స్త్రీ అంబేద్కర్ కలిపించిన రాజ్యాంగ విధులను హక్కులను తమకు లభించే విధంగా పోరాట పటిమ కలిగి ఉండాలి అని తెలియపరిచింది. అలాగే సెక్రెటరీలు అయిన శ్రీదేవి, అపర్ణ , దుర్గలు తమ తమ ఆలోచనలను, ఆచరణ లను పిల్లలు ముందు ఉంచారు. ఈ కార్యక్రమాన్ని ప్రణవ్ జైసూర్య, వి.రమేష్, షేక్ జుబేధా బేగం, శ్రీను పర్యవేక్షించగా గాంధీ నాగరాజన్ మరో కుమారుడు మగేష్, డ్రైవర్ బాబు అయిన రఘు అలాగే ట్రస్ట్ కంపెనీ ఇంచార్జి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …