Breaking News

టిఫిన్ బండి వితరణ…

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య,ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్నట్టు ట్రస్ట్ వైస్ ఛైర్మన్ దేవినేని సుధీర అన్నారు. ఆదివారం గుణదల వైసిపి కార్యాలయం నందు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తో కలిసి దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ద్వారా 18వ డివిజన్ రాణిగారితోట కి చెందిన చిరు వ్యాపారి ఎమ్.డి.ఆశారున్నిసా గారికి జీవనోపాధి నిమిత్తం 30వేలు విలువ చేసే టిఫిన్ బండిని ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర అందజేయడం జరిగింది. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య,ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో కొరివి చైతన్య వర,సొంగా రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *