-ఎమ్మెల్యే డిఎన్ఆర్
మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనునిత్యం పని చేస్తున్నారని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం మండవల్లి మండలంలోని పెరికేగూడెం గ్రామంలో వైఎస్ఆర్ యంత్రసేవ పథకం ద్వారా మంజూరు అయిన వరికోత మిషన్ ను కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే డిఎన్ఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం పెరికేగూడెం గ్రామంలో రూ.24 లక్షలు రూపాయలు విలువైన వరికోత మిషన్ ప్రభుత్వం సబ్బిడి పైన దాదాపుగా రూ. 8 లక్షలు రూపాయలు అందించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెడుతూ రైతుల పక్షపాతిగా వుంటున్నారన్నారు. వ్యవసాయ రైతులకు ఈ మిషన్ మంచి లాభాదాయకమని, పంట పండిన ధాన్యం అప్పటికప్పుడే కోత కోసుకోవచ్చు నన్నారు. వ్యవసాయ అవసరాలకు వాడుకున్న అనంతరం గ్రామంలోని ఇతర రైతులకు తక్కువ రేటు కు అద్దెకు ఇచ్చి వినియోగించుకునేందుకు, తద్వారా గ్రామ రైతులకు ఉపయుక్తంగా ఉండేవిధంగా వరికోత యంత్రాన్ని తీసుకున్న రైతు పెరుమాళ్ళ పెంటయ్య రెడ్డి అభినందనీయుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, మండవల్లి కె.డి.సి.సి బ్రాంచ్ మేనేజర్ రాజు,వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీలక్ష్మి,ఏ.ఈ జరీనామండవల్లి మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, నాయకులు బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్, భావిశెట్టి స్వామి, పెరుమాళ్ళ పెద్దవెంకటేశ్వరరెడ్డి, పెరుమాళ్ళ కొండారెడ్డి, నాగదాసి తామస్, బెతపూడి రాజు, పెద్దిరెడ్డి శ్రీనివాస్, బలే నాగరాజు,పెరుమాళ్ళ కామేశ్వరరావు, పెరుమాళ్ళ వెంకన్న, తమ్మన నాగరాజు, తట్టిగోళ్ళ బులియ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News