విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేపర్, యూ ట్యూబ్ ఛానల్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న స్పీడ్‌న్యూస్ 2022 కాలమాన పట్టికను తాళ్లాయపాలెం శ్రీశ్రీశ్రీ శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి చేతుల మీదుగా శనివారం సత్యనారాయణపురం విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా స్పీడ్‌న్యూస్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలలో తనవంతు సహాయ సహకారాలు అందించిన సేవలను అభినందించారు. ప్రజలకు వార్తాంశాలను అందజేస్తూ ప్రభుత్వాన్ని ప్రజలకు మధ్య వారధిగా వుండాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన వుండాలన్నారు. ఇటువంటి పత్రికలకు ప్రజలు, తాము ఎప్పుడూ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అనంతరం కార్యక్రమంలో స్పీడ్‌న్యూస్ ఎడిటర్ పోతిన శ్రీనివాసరావుకు మెమెంటో అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీడ్‌న్యూస్ ఎడిటర్ పోతిన శ్రీనివాసరావు (వాసు), శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త పోతిన గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం
-తద్వారా వాటి పనితీరు మెరుగుపరుద్దాం -సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వరితగతిన అమల్లోకి తీసుకొచ్చేలా పనిచేయండి -త్వరలో అందుబాటులోకి …