విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరు పర్యావరణం పట్ల భాద్యతగా ఉంటేనే హరిత విజయవాడ సాధించ గలమని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పున్నమి హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమములో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటవలెననీ, నాటుట మాత్రమే కాకుండా ఆ మొక్క పెరుగుదలకు భాద్యత తీసుకోనవలెనని, శుభాకాంక్షలు తెలుపు వేళ ఒక మొక్కను బహుకరించుట అలవాటుగా మార్చుకొనవలెనని అన్నారు. తదుపరి పున్నమి ఘాట్ ను అధికారులతో కలసి అక్కడ భవాని భక్తులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు పరిశీలిస్తూ, అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఘాట్ లు వద్ద నిరంతరం సిబ్బంది విధులలో ఉంచి పరిసరాలు అన్నియు ఎప్పటికప్పడు పరిశుభ్ర పరచే విధంగా చర్యలు చేపట్టాలని మరియు భక్తులు ఎవరు వ్యర్ధములు లేదా వారు వేసుకోనిన బట్టలు నదిలో పడవేయకుండా చూడాలని ఘట్ ఇన్ ఛార్జ్ అధికారులను ఆదేశించారు. అనంతరం రాజీవ్ గాంధీ పార్కు నందలి ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ ఆవరణలో చేపట్టిన పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేసి సందర్శకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్క్ నందు ఇంకను పూర్తి చేయవలసిన ఇంజనీరింగ్ మరియు గ్రీనరీ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ సి.హెచ్ శ్రీనివాసులు, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …