-నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నందలి వివిధ పాఠశాలలో పదవి విరమణ ద్వారా ఖాళి అయిన వివిధ రకాల సబ్జెక్టుల టీచర్ల పదోన్నతలు విషయమై యునియన్ నాయకుల యొక్క అభ్యంతరాలను నివృత్తి చేయాలనే కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ ఛాంబర్ నందు వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ పదోన్నతులు కల్పించు విషయమై రుపొందించిన ప్యానల్ జాభితా యందు వివిధ సంఘాల నాయకుల తెలిపిన అభ్యంతరాలను రికార్డ్ చేసి వారి యొక్క అభంత్యరాలను నిబందనల ప్రకారం వివరణ ఇచ్చి అందరి ఆమోదం పొందిన తర్వాత పారదర్శకంగా పదోన్నతలు ఇవ్వబడనునని వివరించారు. మొత్తం 11 సంఘాల నాయకులు కె.సాంబశివరావు APTF, జి.కిషోర్ STU, ఏ.అనంత కుమార్ UTF, జాన్ సునంద్ PRTU, ఆర్.మణి బాబు, TSN ప్రసాద్ RUPP, ఇంతియాజ్, టి.కుమార్ రెడ్డి YSRTF, వెంకట రెడ్డి, డెమోక్రాటిక్ PRTU, ఇక్బాల్ భాష RUTA, జి.సత్యం MTF తదితరులు పాల్గొని వారి వారి అభంత్యరాలను తెలియజేసారు. సమావేశంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారి KVRR రాజు మరియు స్కూల్ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.