ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి…

-ఏ ఒక్క రైతూ దళారీల చేతిలో మోసపోకూడదు..
-క్షేత్రస్థాయిలో రైతుల కళ్ళాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలి..
-కలెక్టరు జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో దళారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అరికట్టి రైతుకు పండించిన ధాన్యానికి మద్దతు ధరను అందించేకు ప్రభుత్వం ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు.
బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన పీసీసీల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై డివిజన్, మండల స్థాయి, రెవెన్యూ, సివిల్ సప్లై, వ్యసాయ శాఖ అధికారులతో జాయింట్ కలెక్టరు మాధవీలతతో కలసి కలెక్టరు జె. నివాస్ వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని సేకరించే విధంగా మండల స్థాయి అధికారులు చర్యలు చేపట్టాన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడినా సంబందింత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తాహశీల్థార్లు మండల పరిధిలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీలు చేస్తూ ప్రతి రోజు వంద టన్నులు ధాన్యం సేకరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ సహాయకులు, విఆర్వో, వీఎవోలు క్షేత్రస్థాయిలోని రైతుల కళ్లాలో పర్యటించి మాయిచ్యురు మిషన్ ద్వారా తేమ శాతం రిపోర్టు ఆయా మిల్లర్లుకు అందించే విదంగా రైతులకు అందించాలన్నారు. మిల్లర్ల వద్ద తేమ శాతం తేడా వుందంటే మరోకసారి ఆర్బీకేల్లోని పీసీసీ కేంద్రాల్లో పరీక్ష చేయాలన్నారు. ఇందుకు బిన్నంగా ఎవరు ప్రవర్తించరాదన్నారు. ప్రతి రోజు క్షేత్రస్థాయిలో తాహశీల్థారు, విఆర్వో, విఏవో, అగ్రికల్చర్ అసిస్టెంట్ కళ్లాల్లో ధాన్యాన్నిపరిశీలించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రైతుకు ఆర్థిక భరోసాను అందించేందుకు ప్రభుత్వం ఆర్బీకేల్లోనే పీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు హమాలీ, ట్రాన్స్ పోర్టు ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు హామాలీ, ట్రాన్స్ పోర్టు ఛార్జీలు చెల్లింపు ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు. అన్ని ఆర్బీకేల్లో హామాలీలను అందుబాటులో ఉంచి ధాన్యం బస్తాలలోడింగ్, అన్లోడింగ్ కు ఏరోజుకారోజు వారికి వేతనాలు చెల్లించాలన్నారు. ఏ ఒక్కరైతు దళారులను నమ్మి మోసపోకూడదన్నదే ప్రభుత్వం లక్ష్యం ఈ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎవరైనా లక్ష్యాలను విస్మరించినట్లయితే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు పై ఆయా మండల తాహశీల్థార్లు ప్రతి రోజు నివేదికను అందించాలన్నారు. రైతులు నుంచి ధాన్యం తీసుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తే పేమెంట్ ఆలస్యం అవకాశం ఉన్నందున ప్రతి మిల్లు వద్దం విఆర్వో, విఏవోలను నియమించాలన్నారు. జనవరి మాసంలో పూర్తి స్థాయిలో ధాన్యం వస్తుందని ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసే విదంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి వారికి పీపీసీ కేంద్రాల పై అవగాహన కల్పిస్తీ గన్నీబ్యాగ్ లను సిద్దంగా ఉంచాలన్నారు. ఏ ఒక్క రైతన్నా దళారుల చేతిలో మోసపోయారని తెలిస్తే ఆయా మండల స్థాయి అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు హెచ్చరించారు.
వీడియో కాన్పరెన్స్ లో జాయింట్ కలెక్టరు (రెవెన్యూ,ఆర్బీకే) డా. కె. మాధవీలత, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, పౌరసరఫరాల శాఖ అధికారులు, సహకారశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *