విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ 38 వ డివిజన్ అధ్యక్షుడిగా తమ్మిన లీలా కరుణాకర్ ను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నియమించారు. ఈ సందర్భంగా లీలా మాట్లాడుతూ డివిజన్లో అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి జన సైనికుడిగా మొదలైన నా ప్రయాణం ఈరోజు పార్టీ నన్ను గుర్తించి డివిజన్ అధ్యక్షుడుగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి అలాగే మా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్న నగర రథసారధి పోతిన వెంకట మహేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 38వ డివిజన్ కొండ ప్రాంతంలో అనేక ప్రజాసమస్యలు పై ప్రజల తరఫున పోరాడతామని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని లీలా వెల్లడించారు
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …