విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2022వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరమంతా తనపై చూపిన విశేషమైన ప్రేమాభిమానాలు, ఆదరణకు ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మీ యొక్క ప్రోత్సాహం, సహకారంతో గత రెండున్నరేళ్ల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అనితర సాధ్యమైనటువంటి అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పిస్తుందని.. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత అనుభవాలను నెమరువేసుకుంటూ పొరపాట్లకు తావులేకుండా నూతన ఆలోచనలతో ప్రజలంతా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. ఆయనకు ప్రజల దీవెనలు మెండుగా ఉండాలని కోరారు. కోవిద్ వల్ల 2021 సంవత్సరమంతా చాలా కష్టంగా గడిచిందని.. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని అభిలషించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2022 గుర్తుండిపోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …