అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం సందర్భంగా శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్.సమీర్ శర్మకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్,డైరీలను సిఎస్ కు అందించారు. అంతకు ముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షులు కె.ఫరీడ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్,ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సిఎస్ పి.ప్రశాంతి ఆమె భర్త డిల్లీ రావు, స్పెషల్ ఆఫీసర్ ఎంఐజి బసంత్ కుమార్, కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సత్యనారాయణ,సిఎం ఆదనపు కార్యదర్శి ఆర్ ముత్యాల రాజు, రాష్ట్ర కార్మిక శాఖ విశ్రాంత ముఖ్య కార్యదర్శి బి.ఉదయ లక్ష్మి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆదనపు కమీషనర్ శారద తదితరులు సిఎస్ డా.సమీర్ శర్మకు పూల గుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆలాగే విజయవాడలోని దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు సిఎస్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సిఎస్ వారికి పూలగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడంతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు.
Tags amaravathi
Check Also
సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ …