Breaking News

పెంచి ఇస్తున్న పెన్షన్ తో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నా వైఎస్సార్ జగనన్న పెన్షన్ లబ్దిదారులు..

-జిల్లాలో 2,48,555 మంది లబ్దిదారులకు రూ.62.78 కోట్లు పంపిణీ చేసి 47.71 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది…
-కలెక్టరు. జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

జిల్లాలో శనివారం సాయంత్రం 6 గంటల వరకు సామాజిక పెన్షన్లు పంపిణీ కింద 2,48,555 మంది లబ్దిదారులకు రూ.62.78 కోట్లు పంపిణీ చేసి 47.71 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో అవ్వాతాతలకు ప్రేమంతో జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న పెన్షన్ కానుక ఇక నుంచి ప్రతి నెలా రూ. 2500 లబ్దిదారులకు చెల్లించడం జరగుతుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పెన్షన్ లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపన సభానంతరం మధ్యాహ్నం నుంచి జిల్లాలో పెన్షన్ పంపిణీ ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, ఉత్సహాంగా పంపిణీ జరిగింది. పెన్షన్ దారుల ఇళ్ళకు వాలంటీర్లు వెళ్లి పెన్షన్ డబ్బులు అందించడంపై లబ్ధిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాలో వృద్దాప్య, వితంతువు తదితర సామాజిక పెన్షన్లు క్రింద జనవరి, 2022 మాసపు పెన్షన్లు శనివారం సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,24,310 మంది లబ్దిదారులకు వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ. 132.31 కోట్లు రిలీజ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు రూ. 2,48,555 రూపాలయలు పంపిణీ చేసి 47.41 శాతంగా నిలిచిందని కలెక్టరు జె. నివాస్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *