అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సేవలు అందించడంలో ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో కోవిడ్ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్ ప్రజలకు విశేష సేవలు అందించారని కితాబిచ్చింది. దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ (ఆప్షన్) ద్వారా అనేక మంది బాధితులకు సత్వర రక్షణ కల్పించేలా డీజీపీ చొరవ చూపినట్లు పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని బాధితుల ఫిర్యాదులు, వేగవంతమైన దర్యాప్తులో ఎంతో సమయాన్ని ఆదా చేశారని సంస్థ వివరించింది. సాంకేతికను ఉపయోగించుకుని 85 శాతం కేసుల పరిష్కారానికి దోహదపడ్డారని, ఎస్‌వోఎస్ బటన్ ఆప్షన్ ద్వారా ఐదు నెలల్లోనే 2,64,000 డౌన్‌లోడ్‌లతో రికార్డు సృష్టించారని తెలిపింది. మహిళల కోసం ప్రారంభించిన దిశా మొబైల్ యాప్ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్‌లోడ్‌లను చేయడంతో అద్భుతాలు సాధించారని ది బెటర్ ఇండియా సంస్థ గౌతమ్ సవాంగ్ సేవలను ప్రశంసించింది.
Tags amaravathi
Check Also
“రాజమహేంద్రవరం – అనకాపల్లి; రాయచోటి – కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్” – ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్
అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న …