విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కార్యాలయం మచిలీపట్టణం మరియు విజయవాడ, మచిలీపట్టణం, గుడివాడ, నూజివీడు రెవిన్యూ డివిజినల్ స్థాయి అధికారుల కార్యాలయాలు, మండల రెవిన్యూ కార్యాలయాలలో ఈ నెల 3వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక గ్రామ/వార్డ్ సచివాలయాలలో కూడా స్పందన దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు నిర్దేశించిన సమయానికి స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై ప్రజల నుండి స్పందన దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం సక్రమంగా నిర్వహించని మరియు స్పందన కార్యక్రమానికి గైరుహాజరు అయ్యే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ హెచ్చరించారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కు విధిగా ధరించాలన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …