విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార, పౌర సంబంధాల శాఖలో నూతన సంవత్సరం ఆరంభంలో పదోన్నతుల సందడి నెలకొంది. గుడివాడ డివిజనల్ పౌర సంబంధాల శాఖ అధికారి (డీఎల్‌పీఆర్వో) ఐ.కాశయ్య తూర్పు గోదావరి (కాకినాడ) జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వోగానూ, విజయవాడ డీఎల్పీఆర్వో ఆర్.వి.ఎస్.రామచంద్రరావు పశ్చిమ గోదావరి జిల్లా (ఏలూరు) డీపీఆర్వోగానూ నియమితులయ్యారు. గతంలో విజయవాడ డీఎల్‌పీఆర్వోగా పనిచేస్తూ ఆ తర్వాత ప.గో.జిల్లా నరసాపురానికి బదిలీ అయి వెళ్లిన ఎస్.వి.మోహనరావు తిరిగి పదోన్నతిపై కృష్ణాజిల్లా (మచిలీపట్నం) డీపీఆర్వోగా రానున్నారు. విజయవాడ సమాచార శాఖ కమిషనరేట్‌లో డీఎల్‌పీఆర్వోగా ఉన్న ఎ.ఎస్.వీరభద్రరావుకు డీఆపీఆర్వోగా పదోన్నతి రాగా, కమిషనరేట్‌లోనే నియమించారు. ఈ మేరకు సమాచారశాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత డీపీఆర్వో ఎం.భాస్కర నారాయణ ఏడీగా పదోన్నతి పొందడంతో అప్పటి నుంచి కృష్ణా డీపీఆర్వో పోస్టు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం భర్తీ అయింది.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …