విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సావిత్రిబాయి ఫూలే 191వ జయంతి వేడుకలను నగర్ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మహేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంమని భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి, 1848 మే 12 న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారని. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలేఅని, మహిళలు చదువుకోవాలని పరితపించే మహిళని, బాల్య వివాహాలను అడ్డుకున్న మహిళాని, కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారని 1848 లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమెనని, దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమేనని మహేష్ అన్నారు ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి గన్ని రాము, జనసేన నాయకులు శివ, గరికపాటి ఆంజనేయులు, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …