విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం భారతదేశంలో మొట్టమొదటి సాంఘీక విప్లవకారిణి మహాత్మా జ్యోతిరావు పూలే సహదర్మాచరి సావిత్రిభాయి పూలే 191వ జయంతిని ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి సావిత్రిభాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించినారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర సతారా జిల్లాలోని నాయగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మించిన సావిత్రిభాయి తన ఎనిమిదేళ్ల వయస్సులో జ్యోతిరావు పూలేని వివాహం చేసుకుని ఆయన ప్రోత్సాహంతో చిన్న వయసులోనే విద్యావంతరాలు అయి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలని ప్రారంభించి అణచివేతకు గురైన వర్గాలకు, మహిళలకు సకల హక్కుల కోసం సామాజిక బాధ్యతగా సాంఘీక విపమవకారిణిగా మారి పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, బి.సి. నాయకులు కొటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …