Breaking News

మంగళవారం సాయంత్రం నాటికి 86,782 మందికి వాక్సిన్ వేసాం ; జిల్లా కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారిలో వాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య మంగళవారం సాయంత్రం నాటికి 86,782 మందికి చేరిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారిని 2 లక్షల 2 వేల మందిని గుర్తించడం జరిగిందని, వారికి 535 కేంద్రాలలో వాక్సినేషన్ వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈనెల 3వ తేదీ నుండి ఈ ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని, ఈ నెల 7వ తేదీ లోగా 2 లక్షల 2 వేల మందికి వాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. కళాశాలలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, ప్రతీ కళాశాలలోనూ, సచివాలయాలు, పి .హెచ్.సి, సి.హెచ్. సి. లలో వాక్సినేషన్ కోసం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ నియంత్రణకు వాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ననుసరించి ప్రతీ ఒక్కరికీ వాక్సినేషన్ అందిస్తున్నామన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 67.25 లక్షల మందికి కోవిడ్ వాక్సిన్ అందించగా వారిలో 38.26 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ మొదటి మోతాదు అందించారని, 28.99 లక్షల మందికి రెండో డోస్ వేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా రెండో డోస్ వేయించుకోని వారు ఉంటే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల్లో లేదా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజలకు వాలంటీర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారన్నారు. ఈ నెల 10 వ తేదీ నుంచి హెల్త్ కేర్ వర్కర్లు, ప్రంట్ లైన్ వర్కర్లతో పాటు 60 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వీరికి ప్రికాషనరీ డోస్(బూస్టర్ డోస్) వేయడం జరుగుతుందన్నారు. తల్లితండ్రులు బాధ్యత తీసుకుని తమ పిల్లలకు వాక్సినేషన్ జరిగేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *