అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం లోని గంపలగూడెం లోగల ప్రగతి పబ్లిక్ స్కూల్ నందు గత సంవత్సర కాలంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న గృహలక్ష్మి సీరియల్ హీరో నందు కేరాఫ్ చదలవాడ హరికృష్ణ నటిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్ ను స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, మరియు నిర్మాత పామర్తి మేఘన తో కలిసి విద్యార్థులచే ఆవిష్కరించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన సంస్థ శివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం విజయవాడ, కొండపల్లి, తదితర ప్రాంతాలలో సన్నివేశాలు చిత్రీకరణ కొనసాగుతుంది. ఈ ఫిలిం లో అజయ్ .కోలా, లావేటి రవి నటిస్తున్నారు. ఫిలిం డైరెక్టర్ గా గంట్లానబాలకృష్ణ, నిర్మాతగా పామర్తి మేఘన, భావన వ్యవహరిస్తున్నారు. ఈ ఫిలిం జనవరి నెలాఖరుకు పూర్తి చేస్తున్నట్లు దర్శకుడు గంట్లాన బాలకృష్ణ తెలిపారు.
Tags amaravathi
Check Also
ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం
-తద్వారా వాటి పనితీరు మెరుగుపరుద్దాం -సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వరితగతిన అమల్లోకి తీసుకొచ్చేలా పనిచేయండి -త్వరలో అందుబాటులోకి …