-విజయవాడ పరిసర ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని వినతిపత్రం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ పరిశ్రమల శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఏటా విజయవాడ నుంచి వేలాది మంది విద్యావంతులు చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారని.. నగర చుట్టుపక్కల ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు చేయడం ద్వారా వారందరికీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం విశేషంగా పాటుపడుతోందని కొనియాడారు. ముఖ్యంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హయాంలో పారిశ్రామిక ప్రగతి పెద్ద ఎత్తున జరుగుతోందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గౌతమ్ రెడ్డి.. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉద్యోగావకాశాల కల్పనపై ఈ నెల 18 సాయంత్రం లేదా 19 వ తేదీ ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు.