Breaking News

పర్యావరణ హిత యాత్రా స్థలంగా టీ టీ డీ…

-“నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్” కార్యక్రమం కింద టీటీడీ ఎంపిక
-పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి , ఇంధన సామర్ధ్య చర్యల వల్ల టీటీడీలో గరిష్టంగా విద్యుత్ వినియోగం తగ్గించేందుకు చర్యలు
-పర్యావరణ హిత ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు — టీటీడీ , ఈ ఓ , కే ఎస్ జవహర్ రెడ్డి
-దేశాన్ని 2070 నాటికీ కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం లో భాగంగా టీ టీ డీ లో పర్యావరణ హిత కార్యక్రమాలు
– భవిష్యత్ అవసరాల దృష్ట్యా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదం
-టీ టీ డీ చేపట్టే ఇంధన సామర్ధ్య , పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు ఇంధన శాఖ పూర్తి సహకారం — ఇంధన శాఖ కార్యదర్శి , శ్రీకాంత్ నాగులాపల్లి
-రాష్ట్రంలో అమలు చేసిన ఇంధన కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు ఏటా రూ 3500 కోట్లకు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ అధ అయినట్లు అంచనా
-రాష్ట్రంలో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు — నెడ్క్యాప్ ఎండీ , ఎస్ రమణా రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరిన తిరుమలను పర్యావరణ హిత, ఇంధన సామర్థ్య పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) చర్యలు తీసుకుంటుంది . టీటీడీను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ఇంధన సామర్థ్య , పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనుంది. ఇందుకోసం టీటీడీ భవనాల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా గరిష్ట స్థాయిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, అలాగే పునరుత్పాదక ఇంధన కార్యక్రమల ద్వారా కొంత మేర విద్యుత్ ను ఆ భవనాల్లోనే ఉత్పత్తి చేసుకోవడం లక్ష్యంగా టీటీడీ ఈ కార్యక్రమాలు చేపట్టనుంది.
దేశంలో పర్యాటక, యాత్రాస్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ) సంకల్పించింది. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తో పాటూ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ లోను పర్యాటక స్థలాలను బీఈఈ ఎంపిక చేసుకుంది.
టీ టీ డీ , ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులతో జరిగిన వర్చువల్ మీటింగ్ లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ లో సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా పర్యావరణ హితమైన ఇంధన సామర్ధ్య , పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను అమలు చేసేందుకు టీటీడీ సంకల్పించిందన్నారు . తద్వారా టీటీడీని ప్రపంచ ప్రసిద్ధ యాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వివాంరించారు. టీటీడీ భవనాల్లో గరిష్ట స్థాయిలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా గరిష్ట స్థాయిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం అలాగే పునరుత్పాదక ఇంధన కార్యక్రమల ద్వారా అవసరమైన విద్యుత్ ను ఆ భవనాల్లోనే ఉత్పత్తి చేసుకోవడం లక్ష్యంగా టీటీడీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇప్పటికే వాటర్ పంపింగ్ సిస్టం, , ఫ్యాన్లు, లైటింగ్ , , ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంధన సామర్థ్యం కలిగిన పరికరాలను అమర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే సోలార్ పైకప్పులను కూడా విరివిగా వినియోగిస్తున్నట్లు చెప్పారు . దీని వల్ల టీటీడీలో ఇంధనం ఆదా అవ్వటమే కాకుండా విద్యుత్ బిల్లులపై చేసే వ్యయం తగ్గుతుందన్నారు. అలాగే బీఈఈ ద్వారా అమలు చేయనున్న “నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్” అనే కార్యక్రమం వల్ల టీటీడీలో పర్యావరణ హిత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు.
పారిస్ పర్యావరణ ఒప్పందంలో భాగంగా దేశంలో భద్రమైన శుద్ధ, పునరుత్పాదక ఇంధనాన్ని సాధించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి టీటీడీ అమలు చేస్తున్న కార్యక్రమం దోహదకారి అవుతుందన్నారు . అంతే గాక టీటీడీ ని ఒక అద్భుతమైన, ఆహ్లాదకరమైన పర్యావరణ హిత యాత్ర స్థలంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేరేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమల ద్వారా భక్తులకు మరింత మెరుగైన అత్యుతమా సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం , టీటీడీ లక్ష్యమని వివరించారు.
ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ ఆధునిక , ఇంధన సామర్ధ్య,పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు చేపట్టడంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగ్రామిగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు . రాష్ట్రములో చేపట్టిన వివిధ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు వలన ఏటా రూ 3500 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదా అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీని వల్ల వాతావరణం లో 4.7 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గే అవకాశం ఉందన్నారు . టీటీడీ లో అమలుచేసే పునరుత్పాదక , ఇంధన సామర్ధ్య కార్యక్రమణలకు ఇంధన శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు . టీటీడీ కాలుష్య రహిత యాత్రా స్థలంగా తీర్చిదిద్దడంలో ఇంధన శాఖ తన వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే నెడ్క్యాప్ కు పంపిస సందేశంలో దేశ వ్యాప్తంగా ఇంధన సామర్ధ్య పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగానే ప్రముఖ యాత్ర స్థలాల్లో నెట్ జీరో ఎనర్జీ కార్యక్రమాలను చేపడుతునట్లు తెలిపారు. దేశంలో 2070 నాటికి కాలుష్య రహిత దేశం గా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం లో భాగంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం , ఆయా సంస్థలు , ప్రజల సహకారంతో ఈ లక్ష్యాలను విజయవంతంగా సాధిస్తామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు .
తిరుపతిలోని అన్ని కళాశాలలు/పాఠశాలలు మరియు తిరుమలలోని టీ టీ డీ భవనాలలో నెడ్క్యాప్ 2.2 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నెడ్క్యాప్ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణ రెడ్డి వెల్లడించారు.అలాగే, టిటిడిలో ఇంధన సామర్థ్యం మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల, తిరుపతిలలో ఎలక్ట్రిక్ మొబిలిటీని నెడ్క్యాప్ ప్రోత్సహిస్తోంది.పవన విద్యుత్ ప్రాజెక్టులు , సోలార్ రూఫ్ టాప్ సిస్టస్మ్, బయోగాస్ ప్లాంట్లు , విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు తదితర వివిధ కార్యక్రమాలను నెడ్క్యాప్ అమలు చేస్తున్నట్లు వివరించారు .
టీటీడీ లో పునరుత్పాదక ఇంధన అనుసంధానం లేదా స్వచ్ఛమైన ఇంధన వనరుల ద్వారా ఇంధన డిమాండ్ను సాదించేందుకు ఒక ఫ్రేమ్వర్క్ను అందించడానికి బీఈఈ చేసే అధ్యయనం కోసం నెడ్క్యాప్ టీటీడీతో సమన్వయం చేసుకుంటుందని ఆయన అన్నారు.
టీటీడీలో నిర్వహించిన థర్డ్ పార్టీ ఎనర్జీ ఆడిట్ వివరాల ప్రకారం పాత పుంపుసెట్లను , 5000 సాధారణ ఫ్యాన్లను తదితర వాటి స్థానంలో ఇంధన సామర్థ్యం కలిగిన ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చాలని సిఫార్సు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ అధికారులు తెలిపారు. దీని వల్ల ఏడాదికి 62 లక్షల విలువలైన్ 0. 88 మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేశారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *