Breaking News

మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా షేక్ మెహ్మద్ జియాఉద్దీన్

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనారిటీ వర్గానికి చెందిన తనకు ఇటు వంటి ఉన్నత పదవిని కట్టబెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో ఇటువంటి గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మైనారీటీల సంక్షేమానికి, సమగ్ర అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని అన్నారు. మైనారిటీల సంక్షేమ శాఖ అధికారులు అందరినీ సమన్వయ పర్చుకుంటూ వారి సహాయ సహకారాలతో మైనారిటీల సంక్షేమానికై అమలు పరుస్తున్న నవరత్నాల పథకాలను క్షేత్ర స్థాయిలో మరింత అమలు పర్చి ప్రభుత్వానికి మరింత పేరు వచ్చే విధంగా కృషిచేస్తానని ఆయన అన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా మాట్లాడుతూ మైనారీల సమస్యలపై మంచి అవగాహన ఉన్న షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ను మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా ప్రభుత్వం నియమించడం ఎంతో అభినందనీయమన్నారు. గతంలో రెండు సార్లు శాసన సభ్యునిగా, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ గా గురుతర బాధ్యతలు నిర్వహించి మైనారిటీల సంక్షేమానికి ఎంతో పాటుపడ్డ వీరిని మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా ప్రభుత్వం నియమించడంతో మైనారిటీల సంక్షేమానికి నూతన శకం ప్రారంభం అయినట్లుగా ఉప ముఖ్యమంత్రి అభివర్ణించారు. తమ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీఠవేసిందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మైనారిటీల సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ గంథం చంద్రడు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ ను ప్రభుత్వం నియమించడం ఎంతో అభినందనీయమన్నారు. వారి సహాయ, సహకారాలతో మైనారిటీల సంక్షేమానికై మరిన్ని మెరుగైన పథకాలను రూపొందించి అమలు పర్చేందుకు కృషిచేస్తామన్నారు.
మైనార్టీస్ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు మైనార్టీస్ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా బాధ్యతలు చేపట్టిన షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ ను ఘనంగా సత్కరించారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *