-దేవాదాయ మరియు దర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.
-డివిజన్ లో పారిశుద్ద్యాన్ని మెరుగుపరచవలెను,
-నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం లోని 54వ డివిజన్ పరిధిలోని పలు వీధులలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ మరియు అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థానికంగా గల సమస్యలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంలో డివిజన్ లోని పలు వీధులలో చెత్త మరియు వ్యర్దములు ఉండుట మరియు సైడ్ డ్రెయిన్ లలో పూడిక తొలగించకపోవుట వల్ల మురుగునీరు ప్రవాహం సక్రమముగా లేకపోవుట గమనించి మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానమును అవలంభించాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ మరియు సైడ్ డ్రెయిన్ లలో పూడికలను తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అన్నారు. అదే విధంగా ఎండోమెంట్ వారికీ సంబందించిన రాంగోపాల్ సత్రము వారితో చర్చిoచి సత్రం డ్రెయిన్ నందు పూడిక తీయు పనులు చేపట్టాలని సూచించారు. డివిజన్ పరిధిలో ప్రజలకు అందించు రక్షిత మంచినీటి సరఫరా నందలి లీకేజిలను గుర్తించి వాటిని అరికట్టాలని మరియు పాడైన రోడ్ల పునరుద్దరణకు తగిన అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
రైతు బజార్ భవనం ప్రారంభం
54వ డివిజన్ పరిధిలోని వించిపేట నందు రూ.51.92 లక్షల ప్రభుత్వ మరియు VMC సాధారణ నిధులతో నిర్మించిన రైతు బజార్ G +1 నూతన భవన సముదాయాన్ని మంత్రి వర్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్ తో కలసి ప్రారంభించారు.
ఈ ప్రాంత వాసులకు అందుబాటులో ఉండే విధంగా భవనం గ్రౌండ్ ఫ్లోర్ నందు రైతు బజార్ ఏర్పాటు చేయుట జరిగిందని వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక కార్పోరేటర్ల సూచనల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమములను నగరపాలక సంస్థ చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రివర్యులు వివరించారు. అదే విధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరాభివృద్ధియే లక్ష్యంగా నగరపాలక సంస్థ అనేక కోట్ల నిధులతో ప్రజలకు అందించు మౌలిక సదుపాయాల మెరుగుదలకై వివిధ అభివృద్ధి పనులను చేపట్టి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని వివరిస్తూ, ప్రజలు వీటిని సక్రమముగా వినియోగించుకోవాలని అన్నారు.
కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లతో పాటుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు మరియు ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.