-నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో కురుస్తున్న వర్షాల వలన ప్రజలకు అసౌకర్యమునాకు గురి కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడా నీరు నిలువ లేకుండా చూడాలని డ్రైయిన్ల లో ఆటంకములు తొలగించాలని కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశములతో ఆయా శాఖాధిపతులు తగు చర్యలు గైకొనిరి. ఎయిర్ టెక్ మిషన్ తో పల్లపు ప్రాంతములలో లో బ్రిడ్జిలో నిలిచిన నీటిని వెంటనే తోడివేసి ప్రయామమునకు ఆటంకము లేకుండా చేసిరి. అన్ని అవుట్ ఫాల్ డ్రైయిన్లను పరిశిలించి అడ్డు తొలగించి మురుగు నీటి ప్రవాహమునకు ఆటంకము లేకుండా చేసిరి. వ్యర్ధములను వెంటనే తొలగిoచిరి. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, A.D.H. శ్రీనివాసులు పర్యవేక్షణలో సిబ్బంది పాల్గొన్నారు.