Breaking News

జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు… : కలెక్టర్ జె. నివాస్

-భోగభాగ్యాలతో “భోగి”
-సిరి సంపదలతో “మకర సంక్రాంతి”
-కనువిందుగా “కనుమ” పండుగను జిల్లా ప్రజలు నిర్వహించుకోవాలి
-కరోనాను దరిచేరనివ్వద్ధు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రజలందరి జీవితాల్లో మకర సంక్రాంతి వెలుగులు నింపాలని,సంపదలు నిండి సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సిరి సంపదలతో పాటు సంతోషాన్ని తెచ్చే సంక్రాంతి’ పండుగను అందరు ఉత్సాహంగా జరుపుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.గురువారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సంబరాలలో పడి కారోన వ్యా ప్తిని విస్మరించకుండ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను నిర్వహించుకోవాలన్నారు.ముఖ్యంగా ప్రజలు గుమికూడరాదన్నారు. సమూహంగా ఏర్పడటం కోవిడ్ కొత్త వేరియాంట్ ఒమిక్రాన్ ప్రబలడానికి కారణభూతం కావచ్చన్నారు. జిల్లాలో 15-17 సంవత్సరాలున్న 1,75,958 మంది టీనేజర్లకు టీకాలు ఇచ్చాం. 60 ఏళ్లు పై బడ్డ 20,895 మంది వృద్ధులకు కూడా టీకాలు ఇచ్చాం. మీ ఇంటిలో, మీకు తెలిసిన వృద్ధులకు కూడా టీకాలు వేయించి కరోనా నుంచి సురక్షితంగా వుంచాలని ఆయన కోరారు. తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
తెలుగు వారి అతి ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటని కలెక్టర్ అన్నారు. ఈ పండుగ సందర్భంగా జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు అన్నింటిలో నూరుశాతం లక్ష్యాలు సాధించి జిల్లాను అగ్రపథాన నిలుపుదామని పిలుపు నిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం

-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *