విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ నిరుపేద కుటుంబానికి చెందిన ఉప్పు శాంతి వాళ్ల కుమారుడు ఇటీవల కరెంట్ షాక్ తగిలి చేయ్యి దెబ్బతిన్న విషయం డివిజన్ పర్యటన లో ఉన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకురాగా తన కార్యాలయ సిబ్బంది ని ఆసుపత్రికి పంపించి బాధితుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సుపెరడెంట్ కు సూచించినట్టు అవినాష్ తెలిపారు.అంతేకాకుండా బాధితుల తక్షణ అవసరాల కోసం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అవినాష్ అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవల్లిక,వైసీపీ నాయకులు గౌస్, రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …