Breaking News

ఆయుర్వేద వైద్యంకు, ఆయుర్వేద వైద్యులుకి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1970 (ఐఎంసిసి1970) ప్రకారం రాష్ట్ర, కేంద్ర జాబితాలో పేర్లు రిజిస్టర్‌ అయిన క్వాలిఫైడ్‌ ఆయుర్వేద వైద్యులు ఇస్తున్న మెడికల్‌ సర్టిఫికెట్‌/ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌లను ఈ.ఎస్‌.ఐ, టి.సి.ఎస్‌, రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌, ఇంపీకాప్స్‌ మొదలగు సంస్థలు మినహా మిగతా సంస్థలలో ఆమోదించేవారు. వీరు అల్లోపతి వైద్యులు ఇచ్చిన మెడికల్‌/ఫిట్నెస్‌ సర్టిఫికేట్‌లను మాత్రమే ఆమోదించేవారు. ఈ విషయం పై నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మరియు అనేక ఆయుర్వేద వైద్యుల సంఘాలు కేంద్ర ప్రభుత్వంకి వినతిపత్రంలు సమర్పించారు. న్యాయస్థానంని కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌, భారత ప్రభుత్వం వారి ఎన్‌సిఐఎస్‌ఎం యాక్ట్‌ 2020 అనుసరించి ఇకమీదట ఇ.ఎస్‌.ఐ మొదలగు సంస్థలు కూడా రాష్ట్ర, కేంద్ర రిజిస్టర్‌లో పేర్లు నమోదు చేసుకొనివున్న ఆయుర్వేద వైద్యులు ఇచ్చే మెడికల్‌ సర్టిఫికెట్‌/ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌లు ఆమోదించాలని ఆదేశాలు జారీచేశారు. ఇక నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌ మరియు రెన్యువల్‌లలో ఆయుర్వేద వైద్యులు ఇచ్చే మెడికల్‌ సర్టిఫికెట్‌/ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌లు అనుమతించబడును. ఈ సందర్భంగా నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తరుపున ఆయుర్వేద వైద్యంకు, ఆయుర్వేద వైద్యులుకి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వేముల భాను ప్రకాష్‌ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *