విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉన్న జానపద కళల పై ప్రజలకు ఆసక్తి పెరిగితే కళారూపాలు కూడా పునరంకితం అవుతాయని జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్‌కుమార్ చెప్పారు. మంగళవారం స్థానిక బాపు మ్యూజియంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జాతీయ ప్రర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కోలాటం, డప్పు విన్యాసం తదితర కళారూపాల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కె. మోహన్‌కుమార్ తొలుత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కాంస్య విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా కళలకు, సంస్కృతికి పెట్టింది పేరన్నారు. పూర్వీకుల కాలం నుండి సమాజంలో భాగంగా వస్తున్న కళలు నేటికి ఉన్నాయన్నారు. ఆ కళలు సజీవంగా ఉండాలంటే ప్రజల నుండి ప్రోత్సహం, కళాకారుల్లో చైతన్యం రావాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రజలంతా పురాతన జానపద కళలపై స్పూర్తి పొందలన్నారు.జిల్లాలో పర్యాటక స్థలాలపై ప్రాముఖ్యత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని జాయింట్ కలెక్టర్ మోహన్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖాధికారి రామలక్ష్మణ్, ఆ శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …