విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ ఎంప్లాయిమెంట్ రోడ్డు కాల్వ గట్టు వద్ద టెన్నీస్ కోర్డును స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతలాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కాసేపు టెన్నీస్ ఆడి సరదాగా గడిపారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోకూడా రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, కష్టపడేతత్వం అలవడుతుందన్నారు. ఒత్తిడిని జయించి విజయం వైపు దూసుకుపోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే వారికి క్రీడా కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. విజయవాడ నగరమంటేనే క్రీడాకారులకు పుట్టినిల్లు అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అభివర్ణించారు. వారి స్ఫూర్తితో యువత క్రీడలలో విజయాలు సాధించాలన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఆటలు ఆడేందుకు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బంకా భాస్కర్, ఈనాది కాళిదాసు, ఎం.వాసు, అల్లంపల్లి రమణ, శివ, ఎస్.రమణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …