గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నో వందల సంవత్సరాలు పురాతన చరిత్ర కలిగిన గుడివాడ శ్రీ గంగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని 1.74 లక్షల రూపాయలను ప్రభుత్వం (సి జి యఫ్) కంట్రిబ్యూటరీ గ్రాండ్ ఫండ్ గా మంజూరు చేసినట్టు వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్ తెలిపారు. బుధవారం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పాలక మండలి సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ తో అయన అలయ అభివృద్ది పై సమీక్ష నిర్వహించారు, ఈ సంధర్భంగా కాలక్షేప మండపం, షాపులు, అర్చక స్వాముల క్వార్టర్స్, ఆఫీసు, ఈ వో కార్యాలయం, ఆవరణ మొత్తము ఫ్లోరింగ్, గర్భాలయాన్ని అలాగే ఉంచి మిగతా దాన్ని అభివృద్ధి చేసే విధంగా మ్యాపు ప్లానింగ్ చేసామని తెలిపారు, వైసిపి నాయకులు మండలి హనుమంతు రావు మాట్లాడుతూ జిల్లాలో ఈ దేవాలయానికి మంత్రిగారి చొరవ వల్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి జిల్లాలో సి జీ ఎఫ్ గ్రాంట్ అత్యధికంగా పొందిన రెండో దేవస్థానం అన్నారు,33శాతం నిధులు సమీకరించాలని అయితే మంత్రిగారి ఆదేశాలతో దాన్ని 10శాతానికి దేవాదాయ శాఖ అంగీకరించింది అన్నారు,ఇప్పుడు 15 లక్షల రూపాయలు నిధులను సమీకరించాలని ఉందని నిధుల సమీకరణ కోసం ఒక కమిటీని పుర ప్రముఖుడు చంద్రల హరి రాంబాబు అధ్యక్షతన 11 మంది తో ఫండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఈ కమిటీలో సభ్యులుగా జోగా సూర్య ప్రకాష్ రావు, తోట ప్రసాద్, తోట శివాజీ, రాజనాల శ్రీనివాస్, ఆడిటర్ పోకూరు సుబ్రహ్మణ్యం, తదితరులు ఉన్నారని తెలిపారు, ఒక లక్ష రూపాయలు ను మండలి హనుమ మంతరావు, పోకూరి సుబ్రమణ్యం, రాజనాల శ్రీనివాస్ లు ప్రకటించగా, జోగా సూర్యప్రకాశరావు 25000 ప్రకటించారు. డిప్యూటి ఇంజనీర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ జిల్లాలో ఏ దేవస్థానానికి ఎంత మొత్తంలో నిధులు విడుదల చేయలేదని మంత్రి కొడాలి నాని సహకారంతో ఇంత మొత్తం విడుదల చేయడం జరిగిందని, జిల్లాలో రెండు దేవాలయాలకు మాత్రమే ఈ మొత్తంలో నిధులు విడుదల అయ్యాయని తెలిపారు, గత కొన్ని ఏళ్లుగా ఈ గుడి అభివృద్ధికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఎంత మొత్తంలో నిధులు విడుదల అవ్వలేదని మంత్రి కొడాలి నాని సహకారం వల్ల నిధులు విడుదల అయ్యాయని పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను తెలిపారు, నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి కి దుక్కిపాటి శశిభూషణ్ కి ఇతర పార్టీ పెద్దలు అందరికీ అధికారులకి పాలకమండలి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పాలక మండలి సభ్యులు పట్టపు వేణు , ఆగస్త్య రాజు మోహన్ రావు, వంగపండు బ్రహ్మాజీ ,శివ ప్రసాద్, నూకల శివజ్యోతి సూర్యకుమారి, లోయ సత్యనారాయణ తెలిపారు, ఈ కార్యక్రమంలో ఈవో ఎన్. షణ్ముగం, కొండాలమ్మ దేవస్థానం ఈఓ సురేష్ బాబు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధాకర్, వైసిపి నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, మాజీ ధర్మ కర్తలు వెంపల అప్పారావు, అంజనేయలు, ఘంటసాల సత్రం నూతన చైర్మన్ పరిశె వాణి , దేవస్థాన సిబ్బంది నాయుడు, మధు, యేసు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags gudivada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …