-నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలసి టీమ్ వర్క్ చేసి నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ నoదు నూతన కమీషనర్ గా పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు. కమీషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నవరత్నాల ఫలాలు అర్హులైన వారందరికి అందు విధంగా సచివాలయముల ద్వారా ప్రజల ముంగిటకు సంక్షేమ పథకములు తీసుకొని వెళ్ళుట, ప్రజా సమస్యల పరిష్కారమునాకు సత్వరమే అవసరమైన చర్యలు గైకొనుట ప్రాధాన్యతా అంశములుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వo అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకములు మరియు సంస్కరణలను పరిగణలోనికి తీసుకొని నగరాన్ని మరింతగా అభివృద్ధి పరచేవిధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. పారిశుద్యం, ఆరోగ్యం, విద్యలతో పాటుగా నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అందరి సహకారంతో, వివిధ విభాగముల సమన్వయముతో నగరాన్ని అభివృద్ధి పధంలో అగ్రగామిగా నిలుపుటకు చర్యలు తీసుకుంటానని అన్నారు. తొలుత నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ మరియు అన్ని విభాగముల అధిపతులు నూతన కమిషనర్ కి స్వాగతం పలికారు. నగరపాలక సంస్థ నందు కమిషనరుగా భాద్యతలు స్వీకరించిన తదుపరి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.