విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా నియామక నిరుద్యోగ యువత పై దాష్టికంగా లాఠీ దాడులు, కాల్పులు జరిపించిన కేంద్ర బిజెపి ప్రభుత్వం పాలన తీరును ఖండిస్తూ రైల్వే హైపర్ కమిటీతో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ఎన్.ఎస్.యు. ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యములో నిరసన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ క్యాటగిరి RRB NTPC cbt 1 పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ అవకతవకలపై శాంతియుత ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత పై బీహర్ రాష్టృం, పాట్నా రాజధాని గయ రైల్వే స్టేషన్, యుపి రాష్టృం ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో నిరుద్యోగ యువతపై లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగించినన రైల్వే శాఖ, కేంద్ర బిజెపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్ నందు విద్యార్థుల నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలపై రైల్వే బోర్డు ఒక హైపవర్ కమిటీని నియమించిందనీ, హైపర్ కమిటీ తోపాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలన్నారు. సుమారు 1.25 కోట్ల మంది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అప్లై చేసి ఉన్నారని వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రైల్వే పోలీసులు నిరుద్యోగ యువత పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకొని, వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేయడమైనదన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సిటీ అధ్యక్షులు ఎస్కే కరీం మరియు ఇతర రాష్ట్ర నగర నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …