విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ చక్రవర్తుల రాఘవాచారి ఎ పి ప్రెస్ అకాడమి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాద్ రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మరో ఏడాది కాలానికి పదవీకాలం ను పొడిగించింది. 2022 జనవరి 8 తేది నుంచి వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీచేసింది.
కరోన మహమ్మారి ప్రపంచం అంతా భయబ్రాంతులను గురిచేస్తున్న దశలో శ్రీనాథ్ తన రెండేళ్ళ పదవీ కాలంలో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా 13 జిల్లాల్లో పర్యటించి ఆన్ లైన్ ద్వార జర్నలిస్ట్ లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సిలబస్ రూపొందించి ప్రత్యకంగా జర్నలిజం కోర్సును ప్రాంభించారు. దేవిరెడ్డి శ్రీనాథ్ పదవీ కాలం పొడిగింపు పట్ల ప్రెస్ అకాడమి గవర్నింగ్ కౌన్సిల్ మాజీ సబ్యులు, విజయవాడ ప్రెస్ క్లబ్ అద్యక్షలు నిమ్మరాజు చలపతిరావు హర్షం వ్యక్తం చేస్తూ వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …