విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రథం సెంటర్ వద్ద ఉన్న దర్గా హజ్రత్ సయ్యద్ షా ఖాదరీ ఉరుసు గంధం మహోత్సవమునకు దర్గా కమిటీ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ 40 డివిజన్ అధ్యక్షులు షేక్ గయసుద్దీన్ఐ జా తో కలిసి చాదర్ సమర్పించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ దర్గా అబివృద్ది కోసం మంత్రి శ్రీను తక్షణమే 1 కోటి రూపాయలు నిధులు కేటాయించాలని ,దర్గా అబివృద్ది ని పూర్తిగా విస్మరించినారని ,ఫ్లై ఓవర్ నిర్మాణ సమయంలో ఈ దర్గా కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్న హామీని MP కూడా అమలు చేయాలని కోరారు. ఇజా మాట్లాడుతూ మైనారిటీ సోదరులకు ఉరుసు శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్గా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని , అదేవిధంగా దర్గా అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు షేక్ నాగూర్ , జనసేన మైనార్టీ నాయకులు, అబ్దుల్ మనన్, షేక్ ఇస్మాయిల్, ఎండి ఫిరోజ్, షేక్ అజాస్(పండు), జనసేన నాయకులు స్టాలిన్, 38 వ డివిజన్ అధ్యక్షులు ,తమ్మిన లీలా కరుణాకర్ , 50 డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్, సిటీ కార్యదర్శి శనివారపు శివ, మల్లెపు సురేష్, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …