-రూ. 1035.08 కోట్ల విలువైన 5,29,172 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇంతవరకు 58,975 మంది రైతుల నుంచి రూ. 1035.08 కోట్ల విలువైన 5,29,172 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవిలత అన్నారు. శనివారం నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 27 మంది రైతులు ఫోన్ చేయగా వారిలో 18 మంది మాత్రమే ధాన్యం కొనుగోలు విషయంపై తమ సమస్యలను తెలియజేశారు.
ఈ సందర్భంగా జగ్గయ్యపేట మండలం నుంచి బ్రహ్మయ్య మాట్లాడుతూ తనకు నగదు జమ చేసినందుకుగాను రైతుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నందుకు జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలతకు ధాన్యవాదాలు తెలిపారు.
తోట్లవల్లూరు మండలం నుంచి లక్ష్మీకాంత్ తన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిపారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ రైతుభరోసా కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలలోని, గ్రామ, వ్యవసాయ సహాయకులకు, నిర్వాహకులకు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.
విజయవాడ గ్రామీణ మండలం నుంచి సాంబశివరావు, ఇబ్రహీంపట్నం మండలం నుంచి సాంబశివరావు, కంకిపాడు మండలం నుంచి రజనీకాంత్ రెడ్డి, గూడూరు మండలం నుంచి నారాయణ సుకురామర్‌లు తమకు విక్రయించిన ధాన్యానికి నగదు జమ కావాడం లేదని తెలిపారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ ఈ రైతుల వివరాలన్నీ ఈ రోజు బ్యాంకుకు పంపించడం జరిగిందని నగదు రైతుల ఖాతాలలో జమ అవుతుందని ఆమె తెలిపారు.
జి. కొండూరు మండలం నుంచి వెంకట గిరీష్, రవీంద్ర తమకు నగదు జమ అవలేదని తెలిపారు. 27.1.2022 తేదినే మీ ఖాతాలో నగదు జమ అయిందని జాయింట్ కలెక్టర్ మాధవిలత తెలిపారు.
విజయవాడ గ్రామీణ మండలం నుంచి కోదండరాం తోట్లవల్లూరు నుంచి శివనాగబాబు, జగ్గయ్యపేట మండలం నుంచి రహమాన్ తమకు నగాసదు జమ అవ్వలేదని తెలిపారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ వెంటనే నగదు జమ అవునట్లుగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ డా. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.