-కాంగ్రేస్ ఇన్చార్జి Dr.చందు సాంబశివుడు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల విభజన చారిత్రాత్మక, భౌగోళిక, సాంస్కృతి సాంప్రదాయాల అననుసరించి చేయవలసి చేయాలన్న నిబంథనలకు తిలోదాలిచ్చి చెశారని తెనాలి నియోజకవర్గ కాంగ్రేస్ ఇన్చార్జి చందు సాంబశివుడు అన్నారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేమూరు నియోజకవర్గంను బాపట్ల జిల్లాలో కలపటంపై అభ్యంతరం వ్యక్త పరుస్తూ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పునర్వస్థీకలణ లో భాగంగా విశాఖ పాడేరు ఒంగోలు నిబంథనలకు విరుథ్థంగా మినహాయింపులు ఇచ్చారని అటవంటి మినహాయింపు తెనాలికి కూడ ఇచ్చి తెనాలి ని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని లేదా తెనాలి డివిజన్ లో వేమూరు నియోజకవర్గమును కొనసాగించాలని సబ్ కలెక్టరుకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ వేమూరు ప్రజలకు తెనాలి కు నిత్యం రాకపోకలతో సంబంధం బాంథవ్యాలున్నవని అటువంటిది బాపట్లజిల్లాలో కలపటం హర్షించరని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన అని చెప్పి ఇక్కడ ప్రజలను కనీసం సంప్రదించకుండా బాపట్ల లో కలపటం ఏమిటని దీంతో వేమూరు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తెనాలి గుంటూరు తర్వాత అతిపెద్ద A గ్రేడు మునిసిపాలిటి అని రెవెన్యూడివిజన్ 110 చరిత్ర ఉందని ఇప్పటివరకు 94మంది RDO/సబ్ కలెక్టర్లు పనిచెసిన చరిత్ర తెనాలికి అందని, అట్టి తెనాలిని జిల్లాకెంద్రం గా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడికొండ వేంకటేశ్వరావు ప్రభాకరరావు, కొల్లూరు, అమర్తలూరు చుండూరు మండలాలనుండి ప్రతినిథుల పాల్గొన్నారు.