విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఒక్కో హామీ నెరవేర్చుతున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శనివారం నాడు పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడాన్ని హర్షిస్తు విజయవాడ నగరంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో యస్.ఆర్.ఆర్&సి.వి.ఆర్ కాలేజ్ నుండి డి.ఆర్.ఆర్. కాంప్లెక్స్ వరుకు విద్యార్ధి మరియు యువజన సంఘాలతో భారీ ర్యాలీ చేయడం జరిగింది. అవినాష్ మాట్లాడుతూ వికేంద్రీకరణ తోనే అభివృద్ధి సాధ్యం అనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యం అని, 26 జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందచేవిధంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈలాంటి మహత్కర కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం హర్షణీయం అని అన్నారు. దూరపు ఆలోచనతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తామని, అందులో కృష్ణ జిల్లాకి ఎన్టీర్ పెరు పెట్టడం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట ప్రజలుకు అందిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు జగన్ నాయుడు, బచ్చు మురళి, సొంగా రాజ్ కమల్, అక్కల హరీష్, అబ్బి నాయుడు, చందు, గోపి, కిరణ్, సతీష్, కళ్యాణ్, నాగరాజు, అయ్యప్ప, శ్రీను, సుధీర్, శేఖర్ మరియు విద్యార్ధి మరియు యువజన సంఘాలు పాల్గొనడం జరిగింది.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …