తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, సినీ దర్శకుడు, వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, సమాచార హక్కు సంఘం జిల్లా కార్యదర్శి కనపర్తి రత్నాకర్ జన్మదినోత్సవ వేడుకలు టాలెంట్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ తాను జాతీయ ఉద్యమం నేపథ్యంలో తెనాలి పరిసర ప్రాంతానికి చెందిన చుక్కపల్లి రామయ్య చరిత్రని వీరస్థలి తెనాలి అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని రూపొందించామని చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డ్ లభించిందన్నారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో శ్రీశ్రీ మీడియా బ్యానర్‌పై మరో నూతన చిత్రం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కనపర్తి రత్నాకర్ కేక్‌ను కట్ చేయగా, వివిధ ప్రింట్ Ê ఎలక్ట్రానిక్ మీడియాల పాత్రికేయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, సహచరులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్యాణమస్తు చిత్ర దర్శకుడు ఓంసాయి, రామ్‌కి, శ్రీశ్రీ మీడియా నిర్వాహకుడు మునిపల్లి శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్టర్ అపర్ణ చంటి, కొరియోగ్రాఫర్‌లు సుధీర్, కిరణ్, పాత్రికేయులు పున్నయ్య, ప్రభాకర్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …