చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత పర్యావరణ పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యావనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి అన్నారు. చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో మామిడి పంట పరిరక్షణ, సాగు అంశాలపై రైతులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మామిడి పంట పూత దశ నుండి సస్య రక్షణ చర్యలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు తీసుకుంటూ పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చన్నారు. మామిడి సాగులో ఏమైనా సమస్యలు ఉంటె వెంటనే తమ ప్రాంతంలోని రైతు భరోసా కేంద్రంలోని ఉద్యానవన, వ్యవసాయ శాఖ సహాయకులను సంప్రతించాలన్నారు మామిడిలో సమగ్ర సస్య రక్షణ పధకం కింద మామిడి రైతులకు ఎకరానికి అవసరమైన 4 వేల రూపాయల విలువ చేసే వేపనూనె, మామిడి ఫ్రూట్ కవర్స్ మరియు ను ఎన్.పి కె. లిక్విడ్ లను 2 వేల రూపాయలకే అందిస్తున్నామన్నారు. ఒకొక్క రైతుకు గరిష్టంగా 2. 50 ఎకరాలకు రైతులకు సబ్సిడీ పై అందిస్తామని, ఆసక్తి ఉన్న మామిడి రైతులు తమ దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలు లేదా విల్లగె హార్టికల్చర్ మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ లను సంప్రతించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో హార్టికల్చర్ అధికారి అరుణ్ కుమార్, మండల హార్టికల్చర్ అధికారి, గ్రామ హార్టికల్చర్ అధికారులు, మండల హార్టికల్చర్ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Tags chatrai
Check Also
వైద్య, ఆరోగ్య శాఖలో ఏడెనిమిది వేల ఖాళీల భర్తీకి మంత్రి ఆదేశం
-ప్రజలకు మెరుగైన సేవలకు డాక్టర్లు, పేరా మెడికల్ సిబ్బంది నియామకం అవసరమన్న మంత్రి -మంజూరైన పోస్టులు, ఖాళీలపై మంత్రి సత్యకుమార్ …