విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పర్యటనలో భాగముగా కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్ గురువారం 15, 16, 17, 18 వార్డులను తనిఖీ చేయడం జరిగింది. రామలింగేశ్వర నగర్ సాయిరామ్ కట్ పీసెస్ రోడ్, వంగవీటి మోహన రంగా రోడ్డు తదితర రోడ్లు పరిశీలించారు. అవుట్ ఫాల్ డ్రైయిన్ ను తనిఖీ చేయు సంధర్భములో కృష్ణానదికి వరద సంభవించే సమయంలో వరద ప్రవాహము కాలనీల లోనికి రాకుండా నది కట్ట వెంబడి పోలీస్ కాలనీ, తారకరామనగర్, గీతానగర్ కట్ట వంటి ప్రాంతాలలో వాల్వ్ లను ఏర్పాటు చేయుట జరిగినదని ఇంజినీరింగ్ అధికారులు చెప్పగా ఆ ప్రాంతాలను కట్ట వెంబడి పర్యటిస్తూ పరిశీలన జరిపారు. వాల్వ్ లు నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని మరమత్తులు ఎప్పటికప్పుడు నిర్వహించి అందుబాటులో ఉండునట్లు చూడవలేనని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వారధి క్రింద రోడ్ల పై గేదెలు కట్టివేయుట గుర్తించి శానిటరీ ఇన్ స్పెక్టర్ ను ఆ ప్రదేశమంతా పరిశుభ్రంగా ఉంచవలేనని ఆదేశించినారు. పోలీస్ కాలనీ నందలి రిటైనింగ్ వాల్ ను పరిశీలించారు. పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదదేవి, హెల్త్ ఆఫీసర్ డా. ఇక్బాల్ హుస్సేన్, ఎగ్గిక్యూటీ ఇంజనీర్, శానిటరీ ఇన్ స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్
-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …