విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సాయి సూర్య ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన వీరులపాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ భవనంలో మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ అధికారులతో ఓ టి ఎస్, మరియు జగనన్న కాలనీ లో జరుగుతున్న నిర్మాణాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న శాశ్వత గృహ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంబంధించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ కల్పిస్తుందన్నారు. వన్ టైంసెటిల్మెంట్ కింద నగదు చెల్లిస్తే ఆ గృహంపై శాశ్వత హక్కు వస్తుందన్నారు. మండల పరిధిలో జగనన్న కాలంలో జరుగుతున్న నిర్మాణాలు త్వరిగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో జగనన్న కాలనీలో స్థలం వచ్చిన లబ్ధిదారులతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న గృహాలకు భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వీరు లపాడు సచివాలయ భవనాన్ని సందర్శించి అక్కడ ఉద్యోగులతో సచివాలయం లో జరుగుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అందుబాటులో లేని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం పిపి కోటేరు లక్ష్మి, ఎంపీడీవో రామకృష్ణ నాయక్ తాసిల్దార్ గుడిసె విక్టర్ బాబు, హౌసింగ్ ఎఈ సాయి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోటేరు ముత్తా రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎం పి టి సి సభ్యులు పలు వురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …