-తహశీల్దార్లకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆదేశం.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్ లో పెండింగ్ లో ఉన్న జగనన్న కాలనీల లే ఔట్లలో మౌలిక సదుపాయలకు అంచనాలు వెంటనే సమర్పించాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం జగనన్న లే ఔట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై తహశీల్దార్లతో సబ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంటి నిర్మాణం సామగ్రి నిర్మాణ ప్రదేశం వరకు వెళ్లేందుకు వీలుగా రోడ్లు, నిర్మాణ సమయంలో అవసరమైన నీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కంకిపాడు, పెనమలూరు మండలాల్లోని జగనన్న కాలనీల లే ఔట్లలో మౌలిక సదుపాయాలకు సంబంధించి పూర్తి స్థాయి అంచనాలను వెంటనే సమర్పించాలని సంబంధిత తహశీల్దార్లను సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆమోదించిన అంచనాల ప్రకారం రోడ్లు, డ్రైన్లు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కంకిపాడు, పెనమలూరు తహశీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.