-జిల్లాలో ఇప్పటి వరకు 70, 863 ముంది రైతుల నుండి 1289.42కోట్ల రూపాయాల విలువైన 6లక్షల,59వేల,174 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం…
-జాయింట్ కలెక్టర్ డా.కె మాధవి లత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ జేసి కార్యక్రమంలో భాగంగా శనివారం జాయింట్ కలెక్టర్ మాధవీలత నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన కార్యక్రమంలో 37 మంది రైతులు తమ సమస్యలను తెలియజేశారు. తాను విక్రయించిన ధాన్యానికి సకాలంలో నగదు జమ అయిందని నందిగామ మండలం కొణతమాత్మకూరు గ్రామానికి చెందిన రైతు జవ్వాజి రాధాకృష్ణ జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉంగుటూరు నుండి నాగ వరప్రసాద్ రెడ్డి, రాంప్రసాద్, పెడన నుండి సత్యనారాయణ, విజయవాడ రూరల్ నుండి హారిక,సాంబశివరావు, పూర్ణచందర్రావు, సత్యవాణి, గంపలగూడెం నుండి లక్ష్మీనారాయణ, పెదపారుపూడి నుండి రామలింగేశ్వరరావు, వెంకటసుబ్బయ్య, ఘంటసాల నుండి బాబు రాజేంద్ర ప్రసాద్ , పామర్రు నుండి పూర్ణచందర్ రెడ్డి, శ్రీనివాసరావు, గుడివాడ నుండి శ్రీనివాస్ ,ఏడుకొండలు. విజయవాడ నుండి శ్రీనివాసరావు, పమిడిముక్కల గోపాలకృష్ణ .గూడూరు నుండి సాయిబాబులు తాము విక్రయించిన ధాన్యానికి నగదు తమ ఖాతాలకు జమ కాలేదని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ ఆయా రైతుల వివరాలు జిల్లా మేనేజర్ పరిశీలిస్తున్నారని త్వరలో నగదు జమ అవుతుందని అన్నారు. మొవ్వ నుండి సుబ్బారావు, పార్వతి, పెదపారుపూడి నుండి కే శ్రీనివాసరావు తమకు నగదు జమ కాలేదని తెలపగా తక్షణమే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పెదపారుపూడి నుండి సీతారామరాజు హమాలీ చార్జీలు తమకు చెల్లించలేదని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే హమాలీ చార్జీలు చెల్లించాలని సంబంధిత కొనుగోలు కేంద్రం నిర్వాహకులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విజయవాడ రూరల్ నుండి శ్రీనివాసరావు, ఏ కొండూరు నుండి సతీష్ రెడ్డి తమకు నగదు జమ కాలేదని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత రైతులు వారి బ్యాంకు ఖాతాలు ఆధార్కు అనుసంధానం కాకపోవడం వల్ల జమ కాలేదని, తక్షణమే వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీ లత సూచించారు.