విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం జీర్ణించుకోలేక పోతున్నామని, వారి కుటుంబానికి ప్రగాడ సానుబుతిని తెలియజేస్తున్నామని ఏపిఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనురి గౌతమ్ రెడ్డి బుధవారం ఏపి ఫైబర్ నెట్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఏపిఎస్ఎఫ్ఎల్ సంస్థకు మంత్రిగా మూడు మాసాల క్రితం వరకు వ్యవహరించడం జరిగిందన్నారు. సంస్థకు సంబందించిన ప్రతి విషయంలోనూ త్వరితగతిన ఫైల్స్ పరిష్కరించడంలో మంత్రి మా సంస్థ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకునే వారన్నారు. నమ్మకానికి ప్రతీకగా నిలిచిన గౌతమ్ రెడ్డి ఏ విధమైన వివాదాలకు ఆస్కారం లేకుండా పరిపాలన నిర్వహించేవారన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి పురోభివృద్ధికి కంకణం కట్టుకున్న మంత్రిగా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు నిమిత్తం దేశ విదేశాలకు సైతం పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా మంత్రి వ్యవహరించిన తీరు అభినందనీయం అన్నారు. ఈ సమయంలో అశువులు బాసిన సందర్భం రాష్ట్రానికి, కుటుంబ సబ్యులకు, నాలాంటి నాయకులకు, మిత్రులకు తీరని లోటు అన్నారు. కేబుల్ పరిశ్రమకు సంబందించిన సెట్ ఆఫ్ బాక్స్ ల తయారీ పరిశ్రమ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారన్నారు. ఇందుకు సంబందించిన సాంకేతిక నిపుణులతో చర్చించాల్సి ఉన్న సమయంలో ఇలాంటి వార్త వినిపించడం చాలా బాధకరమన్నారు. రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్న సందర్భంలో ఆయనకు ఉన్న నిబద్దత, కార్య దీక్షా విధానం అందరూ అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలుపుతూ ఉద్యోగులందరూ కొద్దీ సమయం మౌనం పాటించి నివాళులు అర్పించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …