-ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన,
-కమిషనర్ పి.రంజిత్ భాషా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, వారి యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. నగరపాలక సంస్థ సేవలలో ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. నేటి స్పందన కార్యక్రమములో మొత్తం 13 అర్జీలు స్వీకరించుట జరిగిందని. వాటిలో అదనపు కమిషనర్ (జనరల్) – 1, పట్టణ ప్రణాళిక విభాగం – 5, పబ్లిక్ హెల్త్ విభాగం – 3, రెవెన్యూ – 1, ఇంజనీరింగ్ విభాగం – 3. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఎస్.ఇ నరసింహ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలను స్వీకరించిన జోనల్ కమిషనర్లు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, సర్కిల్ – 2 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, రెవెన్యూ – 1 అర్జీలు అందించగా సర్కిల్ – 3 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.