Breaking News

‘నా ఓటు నా భవిత – ఒక ఓటుకున్న శక్తి’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 28, 2022 జాతీయ ఓటర్ల దినోత్సవం -2022 ను పురస్కరించుకొని భారత మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో
‘నా ఓటు నా భవిత – ఒక ఓటుకున్న శక్తి’ అంశం పై ఓటరు చైతన్య పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోటీలలో మొత్తంగా 5 విభాగాలైన క్విజ్, షార్ట్ ఫిల్మ్, పోస్టర్ డిజైన్, పాటల మరియు ఫ్లోగన్ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఇందులో అన్ని వయస్సుల వారు పాల్గొన వచ్చన్నారు. యూనివర్శిటీలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొనే
విధంగా సంబంధిత విద్యాసంస్థలు ప్రోత్సహించాలని అన్నారు. గెలుపొందిన వారికి విద్యాసంస్థలు, ప్రొఫెషనల్, ఔత్సాహిక అనే మూడు విభాగాల వారీగా నగదు బహుమతులు ఉంటాయన్నారు. పోటీల కోసం సంబంధించిన వివరాలు, మార్గదర్శకాల కోసం https://ecisveep.nic.in/contest/ వెబ్ సైట్ ను సందర్శించాలని, పూర్తి చేసిన ఎంట్రీలను మార్చి 15 తేదీ లోపు voter-contest Teci.gov.in మొయిల్ కి పంపాలని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *