పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త :
శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి దర్శనానికి వొచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. సోమవారం పట్టిసం లో శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలలో విధుల్లో చేరిన అధికారులు, సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖ వారికి కేటాయించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులకు భద్రత తో కూడి త్వరితగతి దర్శనం కల్పించాలని సూచించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు అత్యంత జాగ్రత్తగా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నందున రెండు రాత్రులు, ఒక పగలు భక్తుల తాకిడి ని దృష్టిలో పెట్టుకొవాల్సి ఉందన్నారు. కోవిడ్ మార్గదర్శకాలు తూ. ఛా. తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులు, శానిటేషన్ పనులకు సంబంధించి , చెత్త తోలగింపు కి చర్యలు చేపట్టాలని ఆదేశించారు . జీలుగుమిల్లి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం, గుటాల లలో మద్యం షాపులను మూసి ఉంచాలని, అనధికార మద్యం షాపులను గుర్తించి తొలగించాలని తెలిపారు.
అందుకు అనుగుణంగా దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. శివరాత్రి సమయంలో భక్తులు దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్తు సరఫరా లో ఆటంకాలు లేకుండా రెండు జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విస్తృతంగా ప్రచారం చేపట్టి భక్తులకు సూచనలు చెయ్యాలని జేసి స్పష్టం చేశారు. పిండ ప్రధాన కార్యక్రమానికి నిర్వహించే పురోహితులు, జంగాలు భక్తులకు చేసుకోవాలని సూచించారు. భక్తులు ప్రతి ఒక్కరూ పోలీసులు సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
డిఎస్పీ కె.లతాకుమారి మాట్లాడుతూ, దర్శనం సజావుగా జరిగేలా భక్తులు దర్శనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం పోలీసులు, ఫైర్, ఫారెస్ట్ శాఖల కు చెందిన యూనిఫాం అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు సేవ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ న్నట్లు వివరించారు. విధుల్లో 450 కి పైగా మంది పోలీసులను నియమించాము, 6 సెక్టార్ లను ఏర్పాటు చేసుకుని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 అడుగులతో కంపార్టమెంట్స్, క్యూ లైన్స్, కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ క్యూ లైన్స్ క్రమబద్ధీకరణ, ప్రసాదాలు వితరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. ఆర్టీసీ వారిచే వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు కోసం ప్రత్యేక తాత్కాలిక బస్ షెల్టర్ , మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు వివరాలు ఎప్పటికప్పుడు తెలియ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈరోజు రాత్రి నుంచి భక్తులు దర్శనానికి రావడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, , స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.