Breaking News

ఈనెల 15వరకే కాలువల ద్వారా నీటి సరఫరా..

-నీటిని పొదుపుగా వాడండి…
-వేసవిలో తాగు, సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు.
-వేరుశనగ పంట రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తాం..
-ఈనెల 15నాటికి అన్ని సాగు,తాగు నీటి చెరువులను నింపుకోండి..
-ఏప్రిల్ చివరి వారంలో త్రాగు నీటి అవసరాలకు మరొకసారి నీటిని విడుదల చేస్తాం..
-అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో సాగు, తాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా సాగు,తాగునీటి అవసరాలకు నీటి సరఫరాపై ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కమిషనర్లతో శనివారం జిల్లా కలెక్టర్ జె నివాస్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుండి దిగువకు నీటిని విడుదల చేసే ఏలూరు, బందర్, రైవుస్ కాలువల ద్వారా నీటి సరఫరా ఈనెల 15వ తేదీ వరకే ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈలోపుగా అన్ని సాగు తాగునీటి చెరువులను నీటితో నింపుకొని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం, బంటుమిల్లి, పెడన మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైతులు వేరుశనగ పంట వేయటం జరిగిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయా మండలాల్లోని పంటలకు సాగునీటికి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీటి సరఫరాపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఏప్రిల్ చివరి వారంలో త్రాగు నీటి అవసరాలకు మరొకసారి నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 389 త్రాగునీటి చెరువులు ఉన్నాయని వీటిలో 130కి పైగా చెరువులను 90 శాతం నీటితో నింపడం జరిగిందన్నారు 226 పైగా చెరువులు 75 నుండి 90 శాతం పైగా నీటిని నింపామని, 24 చెరువులు 50 నుండి 75 శాతం నీటితో నింపటం జరిగిందని కలెక్టర్ అన్నారు. మేజర్ ఇరిగేషన్ కు సంబంధించి జిల్లాలో 889 చెరువులు ఉన్నాయని, వీటిలో 196 ట్యాంకులు నూరు శాతం నీటితోను, 313 ట్యాంకులు 90 నుండి 75 శాతం నీటితోనూ 135 ట్యాంకులు 75 నుంచి 50 శాతం, 222 ట్యాంకులు 50 నుండి 25 శాతం నీటితో నింపడం జరిగింది అన్నారు. ఈ నెల 15వ తేదీలోగా త్రాగు సాగునీటి చెరువులు అన్నిటినీ నూరు శాతం నీటితో నింపాలని కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు

-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *