Breaking News

అక్రిడిడేటడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్ పునరుద్దరణకు ఎంపీ జీవీఎల్ హామీ

-ఏపీయూడబ్ల్యూజే బృందం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్రిడిడేటడ్ జర్నలిస్టుల రైల్వే పాస్ మంజూరుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ జివిఎల్  నరసింహారావు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా రైల్వేశాఖ  జర్నలిస్టులకు రైల్వే పాస్ లను నిలిపివేసింది. ఈ విషయమై శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం  జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనికి స్పందించిన ఆయన కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో మాట్లాడారు. ఈమేరకు రైల్వే పాసులు మంజారు చేసేందుకు తగు చర్యలను చేపట్టమని కేంద్రమంత్రిని ఆయన కోరారు. తాను కూడా ఢిల్లీ వెళ్లి మరోసారి రైల్వే మంత్రితో స్వయంగా చర్చించి చర్చించి పాసుల పునరుద్ధరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం  సమర్పించిన వారిలో  ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు రావు, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దారం వెంకటేశ్వరరావు,  ఈసీ మెంబర్ టి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు

-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *