-ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని.. ఈ మేరకు స్వచ్ఛ సంకల్పానికి ప్రజలందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా 61 వ డివిజన్ పాయకపురంలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఇంటింటికీ 3 రకాల చెత్త సేకరణ డబ్బాలను ఆయన పంపిణీ చేశారు. తొలుత స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాలుర్పించారు. అనంతరం డివిజన్ లో పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలిగిస్తే గృహాలు, పరిసర ప్రాంతాలు, వీధులు శుభ్రంగా ఉండి మురుగు, దోమలను నివారించవచ్చన్నారు. చెత్తను వేరు చేసి అందించేలా ఆయా ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. మరోవైపు గ్రామ స్వరాజ్యం ఆకాంక్షతో సచివాలయ వ్యవస్థ రూపకల్పన చేసి ప్రతి ఇంటి గడపకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మల్లాది విష్ణు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో 96 శాతం హామీలు అమలు చేయడమే కాకుండా.. మేనిఫెస్టోలో లేని మరెన్నో కొత్త పథకాలను ప్రజలకు చేరువ చేశారని వ్యాఖ్యానించారు. విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్నారన్నారు. కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆ వివరాలన్నింటినీ లబ్ధిదారులకు తెలియజెప్పే విధంగా.. సంక్షేమ పథకాల బుక్ లెట్ లను త్వరలోనే ఇంటింటికీ అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఉమ్మడి వెంకట్రావు, కె.కోటేశ్వరరావు, భోగాది మురళి, ఆంజనేయులు, యక్కల మల్లిఖార్జునరావు, వరలక్ష్మి, త్రివేణి, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.